ETV Bharat / city

ఆ విమానాన్ని విజయవాడకు మళ్లించడం కుదరదు - విజయవాడ తాజా వార్తలు

విశాఖ- హైదరాబాద్​-దుబాయ్​ల మధ్య నడుస్తున్న విమానాన్ని విజయవాడకు మళ్లింటడం కుదరదని కేంద్రమంత్రి హర్​దీప్​సింగ్​ పూరీ తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

air india
ఆ విమానాన్ని విజయవాడకు మళ్లించడం కుదరదు
author img

By

Published : Mar 25, 2021, 8:12 AM IST

విశాఖపట్నం-హైదరాబాద్‌-దుబాయ్‌ల మధ్య నడుస్తున్న విమానాన్ని వారానికి మూడు రోజులపాటు విజయవాడకు మళ్లించడం కుదరదని విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ-హైదరాబాద్‌-దుబాయ్‌ మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలు క్రమం తప్పకుండా నడుస్తున్నాయని, వీటి ఫ్రీక్వెన్సీలో ఏమాత్రం మార్పుచేసినా వాటి లాభదాయకతపై ప్రభావం పడుతుందని స్పష్టంచేశారు. దేశంలో 969 ఎకరాల ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ భూమి ఆక్రమణలకు గురైనట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదీ చదవండి: నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.