Harassment for female doctor: విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు.. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా మైలవరంలోని సాయి దీపు ఆసుపత్రి వైద్యుడు కృష్ణకిషోర్.. గతంలో తనతో పాటు కలిసి ఓ ఆస్పత్రిలో పనిచేశారని.. అప్పటినుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తున్న సమయంలో.. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని అందుకు తాను ఒప్పుకోలేదని బాధితురాలు పేర్కొంది. అప్పటినుంచి తనను వేధిస్తూ.. తన భర్తను కూడా చంపేస్తానని బేదిరిస్తున్నట్లు తెలిపారు. ఓ రోజు ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించాడని.. బాధితురాలు వాపోయారు. తనని ఒంటరిగా కలవాలని, తాను చెప్పిన చోటకి రావాలని ఫోను చేసి బెదిరిస్తున్నాడని తెలిపింది.
కృష్ణకిషోర్ తన సోదరుడు విజయకుమార్ తో కలిసి బెదిరిస్తున్నాడని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలిసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: