ETV Bharat / city

ఓ వైపు చదువు, మరోవైపు.. పవర్‌ లిఫ్టింగ్‌.. రాణిస్తున్న మంగళగిరి యువతి.. - పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న గుంటూరు జిల్లా యువతి

Sheikh Saadia Almas : పవర్‌ లిఫ్టింగ్‌లో తండ్రి సాధించిన విజయాలే ఆమెకు స్ఫూర్తి. ఆయన బాటలోనే నడవాలనే కోరిక. దేశం తరపున అంతర్జాతీయ పతకాలు సాధించాలనే ఆశయం. ఫలితంగానే పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తోంది.. షేక్ సాదియా అల్మాస్. కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాల వైపు కదులుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ.. మరిన్ని లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Sheikh Saadia Almas
Sheikh Saadia Almas
author img

By

Published : Feb 8, 2022, 2:18 PM IST

Sheikh Saadia Almas: జీవితంలో సాధించాలనే పట్టుదల ఉంటే విజయం కచ్చితంగా సొంతమవుతుందని నిరూపిస్తోంది.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్. తండ్రి మార్గ నిర్దేశంలో.. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక్కడ కోచింగ్ ఇస్తున్న ఈయనే.. సాదియా తండ్రి సందానీ. పవర్‌ లిఫ్టింగ్‌లో సాధిక గురువు కూడా ఈయనే. పవర్ లిఫ్టింగ్‌లో 2002లో ఇండియా టైటిల్‌ విజేత. కెరీర్‌ ముగిశాక.. ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు.. సందానీ. తండ్రి అభిరుచినే పునికి పుచ్చుకున్న సాదియా.. జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించాలని నిర్ణయించుకుంది.

ఓ వైపు చదువు, మరోవైపు...పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న గుంటూరు జిల్లా యువతి... అదే లక్ష్యం

ఏడాదిలోనే జాతీయ పతకం..

తండ్రి పర్యవేక్షణలో సాధన ప్రారంభించిన సాదియా.. శిక్షణ ప్రారంభించిన ఏడాదే.. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం పతకాన్ని గెలుచుకుంది. అనతి కాలంలోనే 3 సార్లు అంతర్జాతీయ స్థాయి పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది..ఈ యువ పవర్‌ లిఫ్టర్‌. తనకిష్టమైన పవర్‌ లిఫ్టింగ్‌లో... రోజూ 5 నుంచి 6 గంటల పాటు సాధన చేస్తుంది.. సాదియా. ఆ కారణంగా..రాష్ట్ర స్థాయిలో 5 సార్లు, జాతీయ స్థాయిలో 3 సార్లు స్ర్టాంగ్ గర్ల్ టైటిళ్లు గెలుచుకుంది. 3 సార్లు ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తలపడిన సాదియా...రజతం, స్వర్ణం పతకాలు దక్కించుకుంది.

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం..

ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఈ యువతి... సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా చదువుతోంది. ఓ వైపు చదువు, మరోవైపు...పవర్‌ లిఫ్టింగ్‌కు సమప్రాధాన్యతనిస్తూ..ముందుకు సాగుతోంది. క్రమ శిక్షణ, సాధించాలనే పట్టుదల ఉంటే... ఏదైనా సాధ్యమే అంటోంది... ఈ యువతి. సాదియా సాధనకు స్థోమతకు మించే ఖర్చవుతున్నా...తండ్రి సందానీ మాత్రం వెనకాడడం లేదు. అడుగడుగునా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తోంది...ఈ యువతి. తనకు తండ్రి కోచింగ్‌ ఇస్తుండగా...చాలా మందికి ఆశ ఉన్నా, అర్థిక కారణాలతో ముందుకు రాలేకపోతున్నారంటున్న సాదియా... పేదలకు, మరింత మెరుగైన శిక్షణ అవసరం అయిన తనలాంటి వాళ్లకు ఉపయోగపడేలా ప్రభుత్వ అకాడమీ ఉండాలంటోంది. అప్పుడే మెరుగైన శిక్షణతో దేశానికి మరిన్ని పతకాలు వస్తాయని చెబుతోంది. ఇప్పటికే.. రాష్ట్ర, జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన సాదియా... రానున్న రోజుల్లో కామన్ వెల్త్ , ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాలే లక్ష్యంగా సాధన చేస్తోంది.

ఇదీ చదవండి

అన్నదాతలు అప్​డేటయ్యారు.. మిర్చి పంటను కాపాడుకునేందుకు...ఆ ఏర్పాట్లు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.