విజయవాడ ఇంద్రకీలాద్రిపై(vijayawada indrakeeladri) నగరోత్సవ కార్యక్రమాన్ని(nagarotsavam) ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను కనకదుర్గానగర్ మల్లికార్జున మహా మండపం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధికి చేర్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు(devotees) భారీగా తరలివచ్చారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసురమర్దిని(mahishasuramardhini) అవతారంలో దర్శనమిచ్చారు. మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(dharmana krishnadas), సినీ నటుడు రాజేంద్రప్రసాద్(rajendra prasad), శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి(shivaswamy) తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఇదీచదవండి.