ETV Bharat / city

కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై ప్రత్యేక వాహక సంస్థ - ఏపీకెకెఎస్ఎంపీసీఎల్​ ఏర్పాటు న్యూస్

కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు పరిసర ప్రాంత భూములు చౌడు బారకుండా ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ సహా ఉప్పుటేరు తదితర డ్రెయిన్లపై బ్యారేజీలు, రెగ్యులేటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నిధుల సమీకరణ కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల కోసం 2952 కోట్లు ఖర్చు కానున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై ప్రత్యేక వాహక సంస్థ

author img

By

Published : Jan 27, 2021, 5:44 PM IST

కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంత భూములను చౌడు బారకుండా ప్రాజెక్టులు చేప్టటేందుకు ప్రభుత్వం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసింది. చౌడు బారకుండా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు గానూ ప్రకాశం బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీల నిర్మాణంతో పాటు కొల్లేరులోకి నీటిని తీసుకెళ్లే కీలకమైన డ్రెయిన్లపై క్రాస్ రెగ్యులేటర్ లాక్​లను ఏర్పాటు చేయటం కోసం నిధుల సమీకరణ కోసం ఎస్పీవిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

'ఆంధ్రప్రదేశ్ కృష్ణా - కొల్లేరు సాలినిటీ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్' పేరిట కంపెనీల రిజిస్ట్రార్ వద్ద ఎస్పీవీని నమోదు చేశారు. వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీకెకెఎస్ఎంపీసీఎల్​ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 5 కోట్ల మూలధనంతో జలవనరుల శాఖ కార్యదర్శి ఛైర్మన్​గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరులోకి సముద్రపు నీరు చొచ్చుకుని రాకుండా చూసేందుకు వివిధ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాలు చౌడుగా మారకుండా 67 మేజర్, మైనర్ డ్రెయిన్లు, 46 ఇతర కాలువలను అభివృద్ధి పరిచేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా నది నుంచి దిగువకు నీటి ప్రవాహాలు తగ్గిన కారణంగా భూగర్భజలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోందని తద్వారా చౌడుగా మారుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

కృష్ణా - గోదావరి జిల్లాల్లో మంచినీటి కొరతను తీర్చేందుకు అనువుగా 6 ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు జలవనరుల శాఖ తెలియచేసింది. ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజికి దిగువన 62 కిలోమీటర్ల వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక చేశారు. ఉప్పుటేరు కాలువపై రెండు చోట్ల క్రాస్ రెగ్యులేటర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. పెదతడిక కాలువ వద్ద రెగ్యులేటర్ నిర్మాణం, పెదలంక డ్రెయిన్ వద్ద అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మాణాలను చేపట్టనున్నారు. కొల్లేరుకు అనుసంధానంగా ఈ ఆరు ప్రాజెక్టులను 2,952 కోట్లతో చేపట్టనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి: ఇళ్ల స్థలాల కేటాయింపు, పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.