ఏపీలో ఓటు హక్కు పొందిన గవర్నర్ దంపతులు - ap governer latest news
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీలో ఓటు హక్కు పొందారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో గవర్నర్ దంపతులిద్దరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఓటు నమోదు ప్రక్రియను... ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దార్ నాయమణి దగ్గరుండి పూర్తి చేయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నర్ దంపతులకు ఓటరు కార్డును అందజేస్తామని తెలిపారు.