కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాలలో ఆర్థోపెడిక్స్‌లో ఎంఎస్ చేసి ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమదుగు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆలయం నుంచి తిరిగి వస్తున్న 8 మంది యాత్రికులు మరణించగా మరో నలుగురు గాయపడటం బాధాకారమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
అనుబంధ కథనం: