మంచితనం, త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేళ అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుగా మొహర్రం జరుపుతున్నామని... అతని స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని పేర్కొన్నారు. కరోనా వేళ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు తమ నివాసాలలోనే ఉండి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం, సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని కోరారు.
ఇవీ చదవండి..