ETV Bharat / city

స్మార్ట్‌ మీటర్లు తప్పనిసరి...మొదటి దశ 2023కు పూర్తి

ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు 2023 డిసెంబరు నాటికి స్మార్ట్‌ మీటర్లను (ప్రీపెయిడ్‌) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కేంద్రం ఆదేశించింది. నిర్దేశిత కాల వ్యవధిని పేర్కొంటూ ఉత్తర్వులు పంపింది.

స్మార్ట్‌ మీటర్లు
స్మార్ట్‌ మీటర్లు
author img

By

Published : Sep 3, 2021, 5:21 AM IST

ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు 2023 డిసెంబరు నాటికి స్మార్ట్‌ మీటర్లను (ప్రీపెయిడ్‌) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కేంద్రం ఆదేశించింది. నిర్దేశిత కాల వ్యవధిని పేర్కొంటూ ఉత్తర్వులు పంపింది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

మొదటి దశలో... పట్టణ వినియోగదారులు 50% మించిన, 2019-20 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ, వాణిజ్య నష్టాలు 15 శాతానికి ఎక్కువగా ఉన్న డివిజన్లను తీసుకోవాలంది. ఏదైనా ప్రాంతంలో మీటర్లు బిగించడం సాధ్యం కాకుంటే... అదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గడువును పొడిగిస్తుందని తెలిపింది. అది కూడా ఆరు నెలలకు మించకూడదంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ వినియోగదారులకు 2025 నాటికి ఈ ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంది.

ఇదీ చదవండి:

'వైకాపా నేతలు తాలిబన్ల తాతలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.