ETV Bharat / city

TELUGU MEDIUM: తెలుగు మాధ్యమ బోధన ఎత్తివేసేందుకు రంగం సిద్ధం.. మౌఖిక ఆదేశాలు! - ఏపీ నేటి వార్తలు

try to remove telugu medium: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమం అమలుకు సంబంధించిన కేసు.. సుప్రీంకోర్టులో ఉన్నందున టెలీకాన్ఫరెన్సుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

తెలుగు మాధ్యమ బోధనను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం

author img

By

Published : Dec 7, 2021, 9:58 AM IST

తెలుగు మాధ్యమ బోధనను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం.. మౌఖిక ఆదేశాలు!

telugu medium: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధనను ఎత్తివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యాధికారులు ఇటీవల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా... పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ తరఫున అధికారులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 8 తరగతుల దాకా ఒకే మాధ్యమం, ఒకే సెక్షన్‌ ఉండాలని ఆదేశించారు. ఒక మాధ్యమం ప్రకారమే ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని లెక్కించాలని.. ఆ ప్రకారం టీచర్ల జాబితాను పంపాలని సూచించారు. 9, 10 తరగతులకు రెండు మాధ్యమాలనూ కొనసాగించాలన్నారు. ఒకే మాధ్యమమంటే దేనిని ఉంచాలి? దేనిని తొలగించాలి?... అని కొంతమంది ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున.. తాము చెప్పకూడదని ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. 6, 7, 8 తరగతుల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులు తక్కువగా ఉంటే వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆంగ్ల మాధ్యమంలో కలిపేయాలని ఓ అధికారి వెల్లడించారు.

ఉపాధ్యాయుల కొరత..

నూతన విద్యా విధానమంటూ 2,663 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఏకోపాధ్యాయ ప్రాథమిక బడుల నుంచి విద్యార్థులు వచ్చినా ఉపాధ్యాయులు రాలేదు. వీరికి సబ్జెక్టుల వారీగా బోధన సాగించేందుకు టీచర్ల కొరత ఏర్పడింది. దీనికి పరిష్కారంగా ఒకే మాధ్యమ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 60 మంది విద్యార్థుల వరకు ఒకే సెక్షన్‌ ఏర్పాటు చేయాలని.. ఇంకా ఎక్కువగా ఉంటే మరో సెక్షన్‌ పెట్టాలని సూచించారు. మాధ్యమాలతో సంబంధం లేకుండా 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ చొప్పున.. ఉపాధ్యాయులు, విద్యార్థుల జాబితాను సిద్ధం చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులను అవసరమైన బడులకు సర్దుబాటు చేయనున్నారు.

మౌఖిక ఆదేశాలతో సతమతమౌతున్న ప్రధానోపాధ్యాయులు..

తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కలిపేస్తే బోధన సాగించడం ఎలా? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయంతో సమస్యలొస్తాయని పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమం అమలు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. రెండు మాధ్యమాలను కలిపేసినా, తెలుగును తొలగించినా తమకు ఇబ్బందులొస్తాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో ప్రస్తుతం తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల తరగతులను కలిపి బోధిస్తున్నారు. ఎవరికైనా భాషా సబ్జెక్టు ఒక్కటే కావడంతో సమస్య ఏర్పడటం లేదు. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 32 పీరియడ్‌లు బోధిస్తున్నారు. ఇప్పుడు దీన్ని 48కు పెంచనున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున సబ్జెక్టు టీచర్లను ఇవ్వనున్నారు. 60 మంది లోపు ఉంటే ఒకే సెక్షన్‌ ఉంటుంది. సబ్జెక్టుకు ఒక్కరినే ఇస్తారు. మరోవైపు.. రాష్ట్రంలో 100 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం నిలిపివేయాలంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో వీటిని ఏం చేస్తారనే దానిపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ చదవండి:

CHILD PORN VIDEOS SELLER: చిన్నారుల నీలిచిత్రాలను విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.