DULHAN: వివాహం సందర్భంగా ముస్లిం యువతులకు ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. మరోసారి సమయం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ముస్లిం మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 2015 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ‘దుల్హన్’ ప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకం అమలును నిలిపివేసింది. దానిని అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఫారూఖ్ షిబ్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: