ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సులు, ఆటోలను తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని ఆటోలు, అధికంగా విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలపై కేసులు నమోదుచేశారు. పాఠశాల బస్సుల్లో నిబంధనలు పాటించని డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు. 120 బస్సులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆటోల్లో అధికంగా పిల్లలను తరలించే పాఠశాలల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసేందుకు వీలు కల్పించాలని పైఅధికారులను కోరనున్నామని తెలిపారు. ఏ చిన్న నిబంధన పాటించకపోయినా కేసు నమోదు చేస్తున్నామని మీరా ప్రసాద్ తెలిపారు.
ఫిట్నెస్ లేని బస్సులపై ఉక్కుపాదం.. భారీగా కేసులు నమోదు - actions
నిబంధనలు పాటించకుండా విద్యార్థులను తరలిస్తున్న బస్సులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు సరైన పత్రాలు లేని బస్సులు, ఆటోలు, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సులు, ఆటోలను తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని ఆటోలు, అధికంగా విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలపై కేసులు నమోదుచేశారు. పాఠశాల బస్సుల్లో నిబంధనలు పాటించని డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు. 120 బస్సులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆటోల్లో అధికంగా పిల్లలను తరలించే పాఠశాలల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసేందుకు వీలు కల్పించాలని పైఅధికారులను కోరనున్నామని తెలిపారు. ఏ చిన్న నిబంధన పాటించకపోయినా కేసు నమోదు చేస్తున్నామని మీరా ప్రసాద్ తెలిపారు.
( )కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సి హెచ్. నరసింహారావు కోరారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం
సందర్భంగా విస్తృత రక్త దానం కోసం సీఐటీయూ చేస్తున్న సేవలను వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్య పారిశ్రామిక నగరమైన విశాఖ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని మొత్తంగా వీటిలో లక్షల యూనిట్ల రక్తం అవసరం కాగా 70 వేల యూనిట్లు మాత్రమే లభ్యమవుతున్నాయని అన్నారు.
Body:ఈ బాధ్యతను గుర్తెరిగి సి ఐ టి యు నగర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోందని తెలిపారు.బ్యాడ్ ఫర్ మైన్స్ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు యూనియన్ సిఐటియు 14వ తేదీన 677 మంది స్టీల్ ఉద్యోగులతో రక్తదాన శిబిరం నిర్వహించిందని, దీనికి గుర్తింపుగా ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ పురస్కారానికి స్టీల్ సిటీ యూనియన్ ఎంపిక చేశారని స్పష్టం చేశారు.
Conclusion:స్టీల్ ప్లాంట్ గనుల కోసం రక్త దానం చేయాలని సి ఐ టి యు పిలుపు కార్మికులను విశేషంగా ఆకట్టుకుంటుందని, విశాఖలోని ఇతర పరిశ్రమల ఉద్యోగులు కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించి పలువురికి ప్రాణదానం చేయాలని కోరారు.
బైట్: సి.హెచ్.నరసింగరావు, సి.ఐ.టి.యు. రాష్ట్ర అధ్యక్షుడు.