ETV Bharat / city

'కరోనాను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి' - కరోనాపై చంద్రబాబు కామెంట్స్

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఎదుర్కోడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వైరస్​పై ప్రజలకు సత్వర అవగాహన కల్పించాలని ట్విటర్ వేదికగా కోరారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Mar 3, 2020, 11:24 PM IST

చంద్రబాబు ట్వీట్

కరోనా వైరస్​పై ప్రభుత్వం ప్రజలకు సత్వర అవగాహన కల్పంచాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒకవేళ ఎవరైనా వైరస్ బారిన పడితే చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 5 నెలల క్రితం ఏపీలో డెంగీ వ్యాధితో అనేక మంది చనిపోయారన్న చంద్రబాబు... అదే నిర్లక్ష్యాన్ని మళ్ళీ పునరావృతం చేయొద్దని హితవు పలికారు. కరోనాను ఎదుర్కోడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న వైరస్ హైదరాబాద్​కు వచ్చిందన్న వార్త విని ఆందోళనకు గురయ్యానని ట్విటర్​లో పేర్కొన్నారు. మన రాష్ట్రానికి కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని చంద్రబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

'కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం... ఆందోళన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.