రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం(government on doctors private practice in ap) విధించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఈ నిబంధన విధించనుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు.. ఇలా వేర్వేరుచోట్ల పని చేసే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసేందుకు వీల్లేకుండా ఉత్తర్వులు జారీ కానున్నాయి. గతంలో ప్రభుత్వంలో నియమితులైన వైద్యులకూ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధిస్తూ(Restricted doctors private practice).. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
14,037 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
మరోవైపు కొత్తగా 14,037 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్టు పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 3,194 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నియామక ప్రక్రియను సెప్టెంబర్ 28న ప్రారంభించాలని(notification for requirement of doctors in ap ) నిర్ణయించారు. 85 రోజుల్లోగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. కొత్తగా నియమించనున్న వైద్యులు, సిబ్బంది కోసం ఏటా రూ. 676 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. మొత్తంగా వైద్య సిబ్బందికి రూ. 2,753 కోట్ల మేర జీతాలకు వెచ్చిస్తున్న ట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి:
cm delhi tour cancel: సీఎం జగన్ రేపటి దిల్లీ పర్యటన రద్దు.. ఎందుకంటే..