ETV Bharat / city

అమ్మఒడి పథకం లోపాల సవరణకు ప్రభుత్వం కసరత్తు - అమ్మఒడి పథకం లోపాల సవరణకు ప్రభుత్వం జీవో

పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను.. అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో లోపాలపై.. విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాల్లో తప్పులు ఉన్నచోట్ల రీ వెరిఫికేషన్ చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

government is working to rectify the mistakes of the Ammoodi scheme
అమ్మఒడి పథకం లోపాల సవరణకు ప్రభుత్వం కసరత్తు.. తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు
author img

By

Published : Jan 2, 2021, 10:23 PM IST

2020-2021 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల్లో అమ్మఒడి అమలుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో ఉన్న లోపాలపై.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు సర్క్యులర్ జారీ చేశారు. లబ్ధిదారులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాల్లో తప్పులు ఉన్నచోట్ల రీ వెరిఫికేషన్ చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

జాబితాల తనిఖీ కోసం పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, తల్లిదండ్రుల కమిటీ నుంచి ఒక్కొక్కరిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థుల వారీగా ఈ జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 4వ తేదీలోగా ఈ జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు.

ఇదీ చదవండి:

సోమవారం రామతీర్థంలో నిరసన: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.