Government Iftar dinner: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఇందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. ఇఫ్తార్ విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 8 వేల పాసులను జారీ చేసింది.
మరోవైపు విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ముసాఫిక్ ఖానాను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు సీఎం హాజరవుతారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా మధ్యాహ్నం నుంచే పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయంలో అనిశా సోదాలు..ఆన్లైన్ రికార్డుల పరిశీలన..