ఆధార్ కార్డుతో అమలు చేసే రాయితీ విత్తనాల పంపిణీ, పంటల బీమా చెల్లింపును.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రాలకు ఆధార్ అనుబంధ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలుగా అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
సబ్సీడీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను.. రైతులకు నేరుగా అందించేందుకు ఉద్దేశించిన డీబీటీ స్కీమ్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆధార్ చట్టం2016 లోని సెక్షన్ 7 ప్రకారం.. పంట బీమా, రాయితీ విత్తనాలను సైతం ఈ కేంద్రాలనుంచే అందించేందుకు నోటిఫికేషన్ను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
ఇదీ చదవండి: