వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు.. ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మతు ఖర్చుల కోసం ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అర్హుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని రవాణాశాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
InterNational Flights: 'రేపటి నుంచి వందేభారత్ మిషన్ విదేశీ సర్వీసులు ప్రారంభం '