ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సేవల(contract employees service)ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మార్చి 30వ తేదీ వరకు కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వు(government orders on contract employees service)ల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖలోని హెచ్ఆర్ విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు యువజన సర్వీసులు క్రీడల శాఖ, వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కాంట్రాక్టు పోస్టులకు చెందిన ఉద్యోగుల సేవలను 2022 మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది
ఇదీచదవండి.