విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో డిమాండ్ చేశారు. అలా చేస్తే జైల్లో వేస్తారని భయపడే.. ఆయన వెనకాడుతున్నారని ఆక్షేపించారు. అమరావతి రాజధానిగా ఉండాలనే వారికి విశాఖ వెళ్లే హక్కు ఎలా ఉంటుందని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
నిరాహారదీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్‌ను మానవతా దృక్పథంతోనే ఆసుపత్రికి తరలించామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం కోసం లోకేశ్‌ను ఎందుకు దీక్షకు కూర్చోబెట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన తన ఓటమిని అంగీకరించకుండా.. ఓడిపోయిన ప్రతిసారీ ఏదో ఒక వాదన తెరపైకి తీసుకువస్తారని ఆరోపించారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇస్తే తప్పు పడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: