ETV Bharat / city

'రూ.202 కోట్లతో పర్యటకం అభివృద్ధి'

author img

By

Published : Nov 28, 2020, 10:48 PM IST

Updated : Nov 28, 2020, 10:53 PM IST

పర్యటక రంగం అభివృద్ధి కోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని... ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ‌ తెలిపారు. రూ.202 కోట్లతో పర్యాటక శాఖను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

funds are granted for development of tourism department in the state
రూ.202 కోట్లతో పర్యాటక శాఖ అభివృద్ధి

రాష్ట్రంలో పర్యటక రంగాన్ని రూ.202 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ‌ తెలిపారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం లభించిందని చెప్పారు. రూ.142 కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నుంచి మరో రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.

పర్యటక హోటళ్లలో గదుల ఆధునికీకరణ, లంబసింగి, జగత్పల్లి, మారేడుమిల్లిలో రిసార్ట్‌ల అభివృద్ధి, అరకులోయలో గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రం, డ్రైవ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కడప జిల్లా గండికోటలో తీగ మార్గం (రోప్‌ వే) ఏర్పాటు, వైఎస్‌ఆర్‌ స్మారకంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఆధార్ ఆరాటం.. మరిచారు భౌతిక దూరం

Last Updated : Nov 28, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.