ETV Bharat / city

రక్తదానం చేయటానికి యువత ముందుకు రావాలి: గవర్నర్

జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా... రక్తదానం చేయటానికి యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రక్తంతో పాటు రక్త భాగాల నాణ్యత, భద్రతను ప్రోత్సహించడం మిలీనియం అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలకమైందని బిశ్వభూషణ్ పేర్కొన్నారు.

రక్తదానం చేయటానికి యువత ముందుకు రావాలి: గవర్నర్
రక్తదానం చేయటానికి యువత ముందుకు రావాలి: గవర్నర్
author img

By

Published : Jun 13, 2020, 9:11 PM IST

అన్ని దానాలలో అత్యంత విలువైన రక్తదానంతో ప్రాణాలను నిలబెట్టవచ్చని, నేటి యువత క్రమం తప్పకుండా రక్తదానాన్ని ఆచరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా... రక్తందానం చేసి ప్రాణాలను కాపాడటానికి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రక్త నిల్వలు లేని కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని అభిలషించారు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని “సురక్షితమైన రక్తం జీవితాన్ని ఆదా చేస్తుంది” అన్న నినాదంతో నిర్వహిస్తున్నారని గవర్నర్ వివరించారు.

రక్తంతో పాటు రక్త భాగాల నాణ్యత, భద్రతను ప్రోత్సహించడం మిలీనియం అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలకమైందని బిశ్వభూషణ్ పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ పరిస్ధితులు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఆటంకంగా మారాయని, అది ప్రస్తుత సంవత్సరంలో రక్త సేకరణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఈ విపత్కర కాలంలో కూడా రాష్ట్రంలోని 18 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు రక్తదాతలను చేరుకొని సుమారు 6 వేల యూనిట్లను సేకరించి రోగుల అవసరాలకు అనుగుణంగా ఉచితంగా రక్తాన్ని అందుబాటులో ఉంచగలగటం అభినందనీయమన్నారు.

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలందరినీ తాను అభినందిస్తున్నానన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపీ స్టేట్ బ్రాంచ్ రాష్ట్రంలోని ప్రతి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో కనీసం 10 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించే ఏర్పాట్లతో సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమను తాము రక్తదాతలుగా నమోదు చేయించుకుని 'రక్తదానం-జీవితాన్ని రక్షించు' ప్రచారంలో భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపు నిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.