రాష్ట్ర ప్రభుత్వం స్లాబు రెట్లు మార్చి విద్యుత్ బిల్లులు పెరిగేలా చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. పాత స్లాబ్ కింద గ్రూప్ ఏ గా 200 యూనిట్లు, గ్రూప్ బిగా 300 యూనిట్లు, గ్రూప్ సిగా 300 యూనిట్లు ఆపై వాడకంగా ఉంటే.. కొత్త స్లాబ్ కింద గ్రూప్ ఏగా 75 యూనిట్లు, గ్రూప్ బిగా 225 యూనిట్లు, గ్రూప్ సిగా 225 యూనిట్ల వాడకంగా నిర్ణయించారని దుయ్యబట్టారు. స్లాబ్ మార్చడం వల్ల విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతాయన్నది వాస్తవమని.. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలపై ప్రభుత్వానికి దోబూచులాటలెందుకని నిలదీశారు.
ఇదీ చదవండి:రేపటితో 550వ రోజుకు అమరావతి ఉద్యమం.. సీఎం ఇంటి వద్ద హై అలర్ట్