కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో పారిశుద్ధ్య కార్మికులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ వివరాలు నమోదు చేసి... ఆరు నెలల తర్వాత మరోమారు ఆరోగ్య పరీక్షలు చేస్తామని మల్లాది విష్ణు తెలిపారు.
నగరంలో ఉన్న 3600 మంది పారిశుద్ధ్య కార్మికులకు క్యాంపు ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ మెడికల్ క్యాంపును పారిశుద్ధ్య కార్మికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3600 మందిలో ఓ వెయ్యి మందికి వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకొచ్చిన అమెరికన్ ఆసుపత్రి(సెయింట్ ఆన్స్) సిబ్బందిని మల్లాది విష్ణు అభినందించారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు