విలేకరులకు విజయవాడలో కొవిడ్ వాక్సినేషన్ ప్రారంభించారు. లయన్ పుట్టగుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో.. నగరంలోని ఆంధ్రా హాస్పిటల్స్లో ఉచితంగా టీకా పంపిణీ నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి గంటపాటు.. ప్రతిరోజూ 15 మందికి చొప్పున వాక్సినేషన్ కార్డులు ప్రెస్ క్లబ్‌లో ఇస్తామని ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ పీవీ రమణమూర్తి తెలిపారు. ఆసక్తి కలిగిన జర్నలిస్టులు.. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
45 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న విలేకరులు.. తమకు తెలిసిన వైద్యుని నుంచి ఫిట్ ఫర్ వాక్సినేషన్ ధ్రువపత్రం తప్పకుండా తీసుకురావాలని రమణమూర్తి తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారికి ఆ అవసరం లేదన్నారు. ప్రెస్ క్లబ్‌లో పేరు నమోదు చేసుకుని.. టీకా పొందే అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
జగన్ గారూ.. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి..?