ETV Bharat / city

కిడ్నీ కొనుగోలు పేరుతో మోసం - krishna district news

అమాయకుల జేబులు గుల్ల చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. జనాల అవసరాలను ఆసరా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. ఓ జంట కిడ్నీలు అమ్మకానికి పెట్టే ప్రయత్నంలో మోసపోయి డబ్బు వదిలించుకున్న ఉదంతం తాజాగా విజయవాడ పటమటలో చోటుచేసుకుంది.

Fraud in the name of buying a kidney
కిడ్నీ కొనుగోలు పేరుతో మోసం
author img

By

Published : Sep 13, 2020, 8:05 AM IST

Updated : Sep 13, 2020, 2:04 PM IST

విజయవాడ పటమటలో దుకాణం నిర్వహిస్తున్న ఓ జంట...అప్పుల బాధ నుంచి బయటపడేందుకు కిడ్నీలు అమ్ముకోవాలని నిశ్చయించుకున్నారు. కిడ్నీలు కొనేవారి కోసం గతేడాది ఆన్​లైన్​లో వెతికారు. దిల్లీకి చెందిన ఓ ఆస్పత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు ఆ దంపతులతో సంప్రదింపులు జరిపారు. కిడ్నీలకు రూ.2కోట్లు ఇస్తామని నమ్మబలికారు. వివిధ ఖర్చుల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేశారు ఆ కేటుగాళ్లు. ఈ నెల 3వరకు పలు దఫాల్లో రూ.16.61 లక్షలు కాజేశారు. మరో రూ.5లక్షలు తమ ఖాతాల్లో జమ చేయాలని ఆ దంపతులకు తెలిపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి: యూట్యూబ్​లో చూసి నాటుసారా తయారీ... యువ ఇంజినీరు అరెస్టు

Last Updated : Sep 13, 2020, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.