తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. గోదావరి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. పుట్టినరోజు పార్టీ కోసం 20 మంది యువకులు మరిశాల సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లారు. పార్టీ అనంతరం అందరు నదిలో ఈతకు దిగారు. అయితే ఈ క్రమంలోనే నలుగురు యువకుల గల్లంతయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు గల్లంతయ్యారనే వార్తలు తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:
స్వామీజీలకు ప్రభుత్వం లొంగిపోయిందా..?: సీపీఐ రామకృష్ణ