విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 4 విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారి రెండు నగరాల మధ్య విమానం నడవబోతోంది. విజయవాడ - తిరుపతి మధ్య 180 సీట్లు కలిగిన ఎయిర్‌బస్ నడవనుంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ఇప్పటివరకు తక్కువ సీట్లు అందుబాటులో ఉండేవి... డిమాండ్‌ను బట్టి టికెట్ ధర పెరిగేది. తిరుపతికి ఎక్కువ సీట్లు ఉన్న విమానం రావటంతో సీట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని... గతంలో కంటే తక్కువ ఛార్జీతోనే ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రానుండగా... విశాఖపట్నం - విజయవాడ మధ్య స్పైస్ జెట్ సంస్థ సర్వీసును పునరుద్ధరిస్తోంది.
ఇదీ చదవండి:గన్నవరంలో అందుబాటులోకి సౌర విద్యుత్