పరిపాలన అంటే సీఎం జగన్ ఫ్యాక్షనిజం అనుకుంటున్నారని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలను కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలన్న ఆలోచించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా జగన్ తీరు ఉందని విమర్శించారు. ప్రపంచమంతా కరోనాకు భయపడుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్‌ను మార్చే ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని జవహర్ ప్రశ్నించారు. కరోనా తీవ్రతను పక్కన పెట్టి రమేష్ కుమార్ పై పగ తీర్చుకొని జగన్ తన అహం చల్లార్చుకున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: