ETV Bharat / city

ఒకటే ద్వారం.. పనిచేయని స్మోక్‌ డిటెక్టర్లు - విజయవాడ వార్తలు

విజయవాడలో ప్రైవేటు కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చిన స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. దట్టమైన పొగ పీల్చడంతో, అస్వస్థతకు గురైన మరో 21 మందిని ఆసుపత్రికి తరలించారు. స్వర్ణప్యాలెస్‌లో విద్యుత్‌ సంబంధిత లోపాలున్నాయని, షార్ట్‌సర్క్యూట్‌ సంభవించే ఆస్కారం ఉందని హోటల్‌, రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాలకు ముందే తెలిసినా, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో సరిదిద్దకుండానే కొవిడ్‌ చికిత్సా కేంద్రం ప్రారంభించారని తహసీల్దారు నివేదికలో పేర్కొన్నారు.

fire accident
fire accident
author img

By

Published : Aug 10, 2020, 7:30 AM IST

మొదటి అంతస్తులోని కంప్యూటర్‌ సర్వర్‌ రూంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తహసీల్దారు తన నివేదికలో అదే చెప్పారు. స్వర్ణప్యాలెస్‌లో విద్యుత్‌ సంబంధిత లోపాలున్నాయని, షార్ట్‌సర్క్యూట్‌ సంభవించే ఆస్కారం ఉందని హోటల్‌, రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాలకు ముందే తెలిసినా, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో సరిదిద్దకుండానే కొవిడ్‌ చికిత్సా కేంద్రం ప్రారంభించారని తహసీల్దారు నివేదికలో పేర్కొన్నారు. హోటల్‌లో తగిన భద్రతా చర్యలు లేకపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి, ప్రాణనష్టానికి దారి తీసిందని భావిస్తున్నారు. తహసీల్దారు ఫిర్యాదు ఆధారంగా గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆసుపత్రి యాజమాన్యాన్ని ఏ1గా, స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యాన్ని ఏ2గా పేర్కొన్నారు. ఐపీసీ 304 (పార్ట్‌-2), 308 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హోటల్‌లో పొగను గుర్తించే పరికరాలు (స్మోక్‌ డిటెక్టర్లు) కూడా లేవని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. పాత హోటల్‌ కావడంతో చెక్కను ఎక్కువగా వినియోగించారని, రెస్టారెంట్‌లోనూ కుర్చీలు, బల్లలు ఉండటంతో మంటలు త్వరగా అంటుకున్నాయని భావిస్తున్నారు. దాన్ని కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చాక, గ్రౌండ్‌ఫ్లోర్‌లో పెద్ద మొత్తంలో శానిటైజర్లు వంటి మండే గుణమున్న పదార్థాల్ని నిల్వచేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అలంకరణ కోసం క్లాడింగ్‌ చేసిన తేలికపాటి మెటీరియల్‌ అంటుకోవడం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌కి ఒకే ద్వారం ఉండటం అతిపెద్ద భద్రతా లోపమని అధికారులు చెబుతున్నారు. రెండో పక్క ఉండే ద్వారాన్ని మూసేశారని చెబుతున్నారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.