ETV Bharat / city

రుణ భారం.. ఇలా వదిలించుకుందాం...

ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం అనే అనుకుంటారు చాలామంది. కానీ, ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు, మదుపులతోపాటు భవిష్యత్తులో వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండటం... అప్పులు లేకుండా ప్రతి రూపాయి మన ఖాతాలోనే ఉండటం.. చిన్న చిన్న ప్రణాళికలను అమలు చేస్తూ.. రుణాల మీద కట్టే వాయిదాలను, సాధారణ ఖర్చులనూ సమతౌల్యం చేసుకోవడం ముఖ్యం. దీనిద్వారా చేరుకోవాలనుకున్న లక్ష్యాలను సులువగా సాధించడం.. ఇవన్నీ ఆర్థిక నిర్వహణలో భాగమే. ముఖ్యంగా అప్పుల భారాన్ని తగ్గించుకోవడంపైన దృష్టి సారించాలి. అందుకోసం ఏం చేయాలో చూద్దామా..

author img

By

Published : Nov 6, 2020, 11:37 PM IST

రుణ భారం.. ఇలా వదిలించుకుందాం...
రుణ భారం.. ఇలా వదిరుణ భారం.. ఇలా వదిలించుకుందాం...లించుకుందాం...

సంపాదన పెరుగుతోంది.. కానీ, అదే స్థాయిలో ఖర్చులూ అధికంగానే ఉంటున్నాయి. ఇల్లు, కారు.. ఏది కొనాలన్నా.. అప్పు చేయడం తప్పనిసరి అయ్యింది. దీంతోపాటు ఇతర అవసరాలకూ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు వాడకం పెరిగిపోతోంది. ఓవైపు కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు రిజర్వు బ్యాంకు అప్పుల మీద వడ్డీని బాగా తగ్గించింది. దీంతో చాలామందికి తమ అప్పు అర్హత పెరిగింది. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని ప్రయోజనాలు లభించినప్పటికీ.. దీర్ఘకాలంలో వడ్డీ తిరిగి పెరిగితే.. వాయిదాల మొత్తం లేదా వ్యవధి పెరిగే ఆస్కారం లేకపోలేదు. అప్పుడు మన ప్రణాళికలు దెబ్బతినవచ్చు.

కాబట్టి, అప్పుల నిర్వహణలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. తక్కువ వడ్డీకి అప్పులు రావడంతో చాలామంది సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు.. కొంతమంది ఇతర అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక రుణాలను తీసుకునేటప్పుడు కచ్చితంగా వడ్డీ రేట్లలో వస్తున్న మార్పులు గమనిస్తూ ఉండాలి.

వడ్డీ పెరిగితే..

గృహరుణం మీద ప్రస్తుతం 8శాతం కన్నా తక్కువ వడ్డీనే ఉంది. కరోనా సంక్షోభం సమసిపోయిన తర్వాత ఈ వడ్డీ పెరిగే అవకాశాలను కాదనలేం.ఇప్పుడు రూ.30లక్షల ఇంటి రుణంపై 8శాతం చొప్పున 20 ఏళ్లకు రూ.25,100 ఈఎంఐ ఉంటే.. 11శాతం వడ్డీకి చేరితే.. రూ.31,000 అవుతుంది. అంటే, సుమారుగా రూ.6వేల వరకూ ఎక్కువ కట్టాల్సి రావచ్చు.

50 శాతం మించకుండా..

ఆర్థిక ప్రణాళిక సూత్రం ప్రకారం.. నికర ఆదాయంలో నెలవారీ వాయిదాలు 50శాతానికి మించి ఉండకూడదు. ఈ పరిమితి దాటితే ఆర్థిక గందరగోళం ఏర్పడటమే కాకుండా.. ఆదాయం తగ్గితే.. వాయిదాలు కట్టలేక ఆందోళన తప్పదు. అప్పుల వాయిదాలు బాగా పెరిగితే.. ఇతర ఖర్చులకు రాజీ పడాల్సి వస్తుంది.

చెల్లింపులను పెంచండి..

అధిక వడ్డీ రేటుతో వచ్చే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు కోరుకున్న జీవన శైలికి ఆర్థిక సాయం చేస్తాయి. కానీ, ఇవి ఎక్కువ సమయం కొనసాగకుండా.. సాధ్యమైనంత వరకూ వీటి అవసరం లేకుండా ఖర్చులు ఉండేలా చూసుకోవాలి. అత్యవసరాల్లో మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు అధికంగా ఉంటుంటే.. వాటికి కచ్చితంగా కట్టడి చేయాలి. తక్కువ పరిమితితో ఉండే ఒక క్రెడిట్‌ కార్డును మాత్రమే వాడాలి. ఎక్కువ బకాయి ఉండి, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ ఉంటే.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పులు త్వరగా తీర్చేసేందుకు కొంతమంది వాయిదాలను పెంచుతారు. ఇది మంచి అలవాటే. ఇలాంటప్పుడు.. తక్కువ వడ్డీ ఉన్న అప్పులపై కనీస మొత్తం చెల్లించి, ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులకు అధికంగా చెల్లించే ప్రయత్నం చేయాలి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది

క్రమం తప్పకుండా..

రుణ వాయిదాలను ఆలస్యంగా చెల్లిస్తే.. అపరాధ రుసుము కట్టాల్సి వస్తుంది. వాయిదా ఆలస్యమైతే సిబిల్‌ స్కోరూ తగ్గుతుంది. అప్పులే కాదు.. టెలిఫోన్‌, విద్యుత్‌ మొదలైన బిల్లులను గడువు తర్వాత చెల్లించినా.. అపరాధ రుసుములు ఉంటాయి. ఇది మనకు అనవసర భారం.

ఖర్చులకు కళ్లెం..

అనవసరమైన విలాసాలను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తే.. కోరుకున్న ఆర్థిక స్థాయికి వెళ్లడం చాలా సులభం. మీ కుటుంబ సభ్యులతో విపులంగా చర్చించి, ఆర్థిక భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికలు వేసుకోండి. తప్పనిసరి అలవాట్లు ఏమైనా ఉంటే.. వాటిని తక్కువ ఖర్చు ఉన్న వాటికి మార్చుకునే ప్రయత్నం చేయండి.

ప్రమాదాల బారినపడితే..

ఊహించని ప్రమాదాలు.. ఆర్థికంగా మనల్ని కుంగదీస్తాయి. ఇలాంటప్పుడు రుణ వాయిదాలను చెల్లించడం కష్టం కావచ్చు. దురదృష్టవశాత్తూ రుణగ్రహీత మరణిస్తే.. కుటుంబంపై ఆ రుణ భారం పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. అందుకోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ లేదా.. లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీల్లాంటివి తీసుకోవాలి. తీవ్ర వ్యాధులూ, వైకల్యంలాంటి వాటి బారిన పడినప్పుడూ ఉపయోగపడే రైడర్లను ఎంపిక చేసుకోవాలి.

అత్యవసరాల్లో ఆదుకునేలా..

ప్రస్తుత జీవన శైలిని ఇబ్బంది లేకుండా కొనసాగించేందుకు అత్యవసర నిధిని తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ఉపాధి కోల్పోవడం లేదా సంపాదన తగ్గడం వల్ల వచ్చే సమస్యల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. అన్ని పరిస్థితులనూ ఊహిస్తూ.. తగిన నిధిని అందుబాటులో పెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలవారీ ఆదాయానికి కనీసం 6 రెట్ల వరకూ ఈ నిధి తప్పనిసరి. దీన్ని అవసరాన్ని బట్టి, ఆర్థిక అత్యవసరాల్లో వినియోగించుకోవచ్చు. లేదా ఏదైనా అప్పును ఒకేసారి చెల్లించేందుకూ ఉపయోగపడుతుంది. అదనపు ఆదాయం వచ్చినప్పుడూ ఆ మొత్తాన్ని రుణాన్ని తీర్చేందుకు వాడుకోవచ్చు.

- ఫణి శ్రీనివాసు, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.