కర్నూలులో తుంగభద్ర నది ఒడ్డున తెదేపా హయాంలో బ్రాహ్మణుల కోసం నిర్మాణం చేపట్టిన భవనానికి ఇప్పుడు ఇతరులకు అప్పగించడంపై తెదేపా నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గండూరి మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే ఆ భవనాన్ని బ్రాహ్మణ పెద్దలకు అప్పగించి ఎమ్మెల్యే కూన రఘుపతి తన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్రాహ్మణుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
తెదేపా హయాంలో 90 శాతం నిర్మాణం పూరైన భవనానికి బహుళ జనుల అపర కర్మల భవనంగా పేరు మార్చి స్ధానిక ఎమ్మెల్యే ప్రారంభించడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండాపోయిందని.. ఇప్పుడు కర్మల భవనాలను ఆక్రమించుకునేలా, కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేయటం సరైన పద్ధతి కాదని విమర్శించారు.