ETV Bharat / city

విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో కి'లేడీ' వైద్యురాలు

కరోనాను సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ మహిళ. వేషం మార్చి కొవిడ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా చెలామణీ అయింది. కరోనా రోగుల మధ్య తిరుగుతూ బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెబుతూ డబ్బు వసూలు చేసింది. చివరికి పోలీసులకు చిక్కింది.

Fake lady doctor arrested in Vijayawada Government hospital

author img

By

Published : Jul 30, 2020, 4:12 PM IST

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముసుగులో కరోనా రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న శైలజ అనే మహిళను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పీపీఈ సూట్ ధరించి, మెడలో స్టెతస్కోప్​తో లోనికి వెళ్లి వైద్యురాలిగా చలామణి ‌అవుతుందని పోలీసులు తెలిపారు.

చికిత్స పేరుతో డబ్బు వసూలు

విజయవాడ నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా శైలజ (43) కొద్ది రోజులుగా తాను వైద్యురాలినంటూ తిరుగుతోంది. వైద్యులు విధులు ముగించిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ఆ ఆసుపత్రిలోనే ఉంచుతారు. దానిని తెచ్చుకుని ధరించి కరోనా బాధితులకు సేవలు అందిస్తానని చెబుతూ వార్డుల్లో యథేచ్ఛగా తిరుగుతోంది. కిట్‌ వేసుకుని తిరుగుతుండటంతో అందరూ ఆమెను వైద్యురాలని నమ్మారు. ఆ సమయంలో కొవిడ్‌ బాధితులు ఆదమరిచి తమ మంచాలపై ఉంచిన చరవాణులను తస్కరిస్తోంది. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానని నమ్మబలుకుతూ డబ్బులూ వసూలు చేస్తోంది.

ఇలా దొరికింది

ఇటీవల ఆమె కిట్‌తోనే బయటకు వెళ్తుండటంతో అక్కడ కాపలా సిబ్బందికి అనుమానం వచ్చి ఆడ్డుకోగా పారిపోయింది. బుధవారం కూడా ఇదే విధంగా కనిపించడంతో మళ్లీ ఆమెను అడ్డుకున్నారు. అయినా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా సిబ్బంది వచ్చి పట్టుకుని నిలదీశారు. ఆమె చెప్పే మాటలకు..చేసే పనికి పొంతన లేకపోవడంతో వారు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను, ఆమె భర్తను ఆరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గతంలో కూడా గవర్నర్ పేట్, ఎస్​ఆర్​పేట్, పటమట పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి

పేకాట శిబిరం వ్యవహారంతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే శ్రీదేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.