రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో స్థానిక తెదేపా కార్యాలయాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... స్థానిక వైకాపా ఎమ్మెల్యే కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితమయ్యారని అన్నారు. సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోకుండా పాదయాత్ర ముగించారని ఉమ ఎద్దేవా చేశారు.
తుపాను బాధిత రైతులకు పరిహారం అందేలా అసెంబ్లీలో పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నామని బొండా ఉమ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పది జిల్లాల్లో తెదేపా ఆధ్వర్యంలో పలు బృందాలు పర్యటించి నష్టాలను అంచనా వేస్తున్నాయని... వీటన్నింటిని అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తామన్నారు.
ఇదీ చదవండి