ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ పాఠశాలలుగా మారిస్తే 34 వేల స్కూళ్లు మూతబడి 15 వేల పోస్టులకు గండిపడుతుందని మాజీ మంత్రి జవహర్(Jawahar) ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. విద్యా వ్యవస్థపై రెండేళ్లుగా ప్రభుత్వం శ్రద్ధ చూపనందుకే నీతి ఆయోగ్ ర్యాంకుల్లో 3 నుంచి 19వ స్థానానికి దిగజారిపోయిందని విమర్శించారు.
ఇప్పటికే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేశారని లేఖలో పేర్కొన్నారు. విదేశీ విద్యను నిలిపివేసి వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశారని జవహర్ మండిపడ్డారు.
ఇదీచదవండి