రాష్ట్రంలో భాజపా త్రికోణ ప్రేమ కథకు తిరుపతి ప్రజలు ముగింపు పలకాలని మాజీమంత్రి జవహర్ కోరారు. సినిమాలకు తీసిపోని విధంగా భాజపా ప్రేమ కథ నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఒక జాతీయ విధానం లేకుండా ఆ పార్టీ తీరు ఉందన్న అయన... తెలంగాణలో పవన్ కల్యాణ్‌పై లేని అభిమానం తిరుపతిలో ఎందుకొచ్చిందో సమాధానం చెప్పాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజును డిమాండ్ చేశారు.
తిరుపతి బరిలో జనసేనను పోటీలో లేకుండా చేసి.. పార్టీ అధినేత పవన్‌ను తిరుగులేని నాయకుడిగా ఎలా చేస్తారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి పంపే ప్రతి దస్త్రాన్ని గవర్నర్ వెంటనే ఎలా ఆమోదిస్తున్నారో చెప్పాలన్నారు. సీఎం జగన్.. గవర్నర్ ద్వారా భాజపాకు రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారని పేర్కొన్నారు. జగన్, సోము వీర్రాజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ... లోపల అపారమైన అనుభంధం పెంచుకుంటున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: