మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala rajender) సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా (Jp nadda)తో దిల్లీలో సమావేశమయ్యారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో పాటు, తెరాస-భాజపా సంబంధాలపై పలు సందేహాలను ఈటల లేవనెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాస(Trs), భాజపా(Bjp) మధ్య రాజకీయ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన నడ్డా.. రాజేందర్‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరికపై త్వరగా నిర్ణయానికి రావాలని సూచించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
రెండూ ఒకటేనన్న భావన...
‘‘రాష్ట్రంలో తెరాస, భాజపా ఒకటేనన్న భావన ప్రజల్లో ఉంది. అందుకు తగినట్లే తెరాస నాయకత్వం వ్యవహరిస్తోంది. మొదట కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్(KCR) తిడతారు. తర్వాత అమలు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాల అమలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో తెరాస, భాజపా చేతులు కలిపితే భాజపాను నమ్మి వచ్చే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలున్నా.. కేంద్ర ప్రభుత్వం ఒక్క విచారణ చేయకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయి’’ అని ఈటల వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ప్రతిపక్షాలే ప్రశ్నించాలి..
నడ్డా స్పందిస్తూ ‘‘పశ్చిమబెంగాల్‌లో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే వరకు ఎదిగాం. తెలంగాణలోనూ అంతకుమించి దూకుడు ప్రదర్శిస్తాం. తెరాస ప్రభుత్వ అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తాం. కేసీఆర్ (Kcr) కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు విమర్శిస్తున్నారో.. తర్వాత ఎందుకు అమలు చేస్తున్నారో అక్కడి ప్రతిపక్షాలే ప్రశ్నించాలి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా (Blp) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’’ అని ఈటల (Eetala)తో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
త్వరలో నిర్ణయం...
అంతకుముందు భాజపా (Bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay), మాజీ ఎంపీ వివేక్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌లతో కలిసి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు నడ్డాను దిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈటల, రవీందర్‌రెడ్డిలను బండి సంజయ్ నడ్డాకు పరిచయం చేశారు. సుమారు 50 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. తెరాసలో ఉద్యమకారులకు అవమానం జరుగుతోందని ఈటల వివరించారు. భాజపాలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
తరుణ్‌చుగ్ ఇంట రాత్రి భోజనం..
భాజపా జాతీయ అధ్యక్షుడితో భేటీ అనంతరం బండి సంజయ్ (Bandi sanjay), ఈటల రాజేందర్ (eetala rajender), రవీందర్‌రెడ్డి, వివేక్‌లు తరుణ్‌చుగ్ ఇంటికి వెళ్లారు. అక్కడే రాత్రి భోజనం చేశారు. వీలునిబట్టి దిల్లీలో ఒకరిద్దరు భాజపా (Bjp) ముఖ్య నేతలను మంగళవారం ఈటల కలిసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: