జగన్ గురించి గూగుల్లో దొరికే కథనాలు చదివే ధైర్యం వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు ఉందా? అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు ఘన చరిత్ర, మీ నాయకుడి అవినీతి గూగుల్ చెబుతోందని విమర్శించారు. జాతీయ నాయకుడు ఎవరో..,జాతిని అడ్డం పెట్టుకుని దోచేసుకున్నది ఎవరో...ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
రాజీనామాలకు సిద్ధం: వెలగపూడి రామకృష్ణబాబు
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క అభివృద్ధి పని జరగలేదని తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. తండ్రి వైఎస్ ..2000వేల కోట్లు భూములు విశాఖలో అమ్మేస్తే, ఆయన కుమారుడు జగన్ మళ్ళీ భూములు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ బిల్డ్ ఏపీలో విశాఖలోని తుపాన్ షెడ్, పోలీస్ క్వాటర్స్, ఫక్కితకి లో భూములు... అమ్మే ప్రయత్నం చేశారని చెప్పారు. ఉన్న భూములు అమ్మి సంక్షేమంటే పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలుపై తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. అమరావతిపై రెఫరెండం పెడితే ప్రజలు.. ప్రభుత్వం వైపు ఉన్నారో..ప్రతి పక్షం వైపు ఉన్నారో తేలుతుందని...చంద్రబాబు సహా అందరం రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి