ETV Bharat / city

'ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం' సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం ! - 'ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం' సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం !

నిత్యం మనం వాడే వస్తువులపై అధిక సంఖ్యలో దాగి ఉండే క్రిములు అనారోగ్య కారకాలు. చేతులు శుభ్రం చేసుకోకపోతే గోళ్లలో చేరిన బ్యాక్టీరియా, కొన్ని రకాల క్రిములు ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. రోగాల బారిన పడటానికి ప్రధానంగా చేతులు శుభ్రం చేసుకోవకపోవటమేనని నిపుణులు పేర్కోంటున్నారు. ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయటం కన్నా..హానికారక సూక్ష్ణజీవులను నిరోధించటంపై ప్రజలు దృష్టిపెట్టాలని బ్రిటీష్ రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ సూచిస్తోంది. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుతు ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పరిశుభ్రతపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

'ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం'
author img

By

Published : Oct 15, 2019, 4:56 PM IST

క్రిములతో అనారోగ్యం....
మనం నిత్యం వాడే వస్తువులపై ఇన్ఫుయోంజా వైరస్, హైపటైటిస్ ఎ,బి, సి, డి,తోపాటు హెర్పిస్ , ఎడినో తదతర రకాలకు చెందిన రోగకారక క్రిములు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వీటి ద్వారా వివిధ రకాల జ్వరాలు, రక్తకణాల తగ్గుదల,డయేరియా వంటి వ్యాధులు సోకుతాయి. చరవాణిని ఉపయోగించిన చేతులతో ఆహారం తింటే చర్మ, ఎముక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రకరకాల క్రిముల ద్వారా జీర్ణవ్యవస్థ సమస్యలు, జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మట్టిలో ఆడుకునే పిల్లలపై క్రిముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే గోళ్లలో సూక్ష్మక్రిములు చేరి డయేరియా, రక్తహీనత, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకుతాయి.
క్రిములు ఎక్కవగా ఎక్కడెక్కడ ఉంటాయంటే !

  • చరవాణి తెరపై 25 వేలకుపైగా క్రిములు ఉంటాయి. ఇవి మరుగుదొడ్లలో ఉండే వాటికంటే 18 రెట్లు అధికం
  • టీవీ రిమోట్‌పై 820 రకాల బ్యాక్టీరియా ఉంటుంది.
  • కరెన్సీ నోట్లపై 78 రకాల క్రిములు ఉంటాయి.
  • లిప్ట్ బటన్లు
  • తలుపుల గొళ్లేలు
  • పుస్తకాలు
  • కార్యాలయాల్లో సామాగ్రి
  • ఏటీఎంలు

చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులు
చేతులను శుభ్రం చేసుకునేటప్పుడు ఎనిమిది పద్ధతులు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతిగోళ్లు పెరిగిన వెంటనే కత్తిరించుకుంటూ మట్టి చేరకుండా చూసుకోవటం. ముందుగా చేతులను నీటితో కడిగి, సబ్బు రుద్ది ఒక అరచేతిని మరో అరచేతితో రద్దుకుంటూ 20 సెకన్లపాటు ఐదు సార్లు రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చేతుల్లో దాగి ఉన్న క్రిములను 60 శాతం వరకు తొలగించవచ్చని వైద్యులు తెలిపారు.
ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి !

  • కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత విధిగా చేతులను సబ్బుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి
  • భోజనానికి ముందు, తరువాత
  • పిల్లలకు ఆహారం తినిపించే ముందు
  • అనారోగ్యంతో ఉన్న వారికి భోజనం పెట్టే ముందు, మందులు ఇచ్చే ముందు.
  • చర్మంపై పడిన గాయాలను తాకినప్పుడు
  • మాంసాన్ని పట్టుకున్నపుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కుచీదినపుడు
  • పెంపుడు జంతులను తాకినా, వాటిని కడిగినా
  • ప్రయాణం చేసి వచ్చిన అనంతరం
  • చిన్నపిల్లలు పాఠశాల నుంచి ఇంటిక వచ్చిన తరువాత

నిర్లక్ష్యం వద్దు - శుభ్రత ముద్దు
"పరిశుభ్రత విషయంలో ఆశ్రద్ధ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. రోజూ చేసే పనుల వల్ల అనేక మలినాలు చేతుల్లోకి చేరతాయి. అవి మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించి రోగాలు కలిగిస్తాయి. చిన్న పాటి విషయాలను నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవటంతో రోగాల బారిన పడుతున్నారు".
- డాక్టర్ గంగధరకుమార్

Intro:Body:

live from vizianagaram

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.