ETV Bharat / city

చావునైనా భరిస్తా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోను: ఈటల - Etela Rajender Future Activity

ఈటల రాజేందర్​ తనపై చేసిన ఆరోపణలపై మీడియా సమావేశంలో స్పందించారు. తాను ప్రేమతోనే లొంగుతాను తప్పా.. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని హెచ్చరించారు. చావునైనా భరిస్తా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోనని ప్రకటించారు. త్వరలో భవిష్యత్​ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

Etela Rajender
ఈటల రాజేందర్​
author img

By

Published : May 3, 2021, 12:39 PM IST

చావునైనా భరిస్తా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోను: ఈటల

గతంలో తెలంగాణలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన తనపై ఆ దిశగా కూడా కేసులు పెట్టొచ్చని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తాను ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడినని తెలిపారు. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని చెప్పారు. ఎంత నష్టపోయినా లొంగిపోయే వాడిని కాదని స్పష్టం స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడగొచ్చు

పార్టీ పెడతానని... పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదని ఉద్ఘాటించారు. కారు గుర్తుపై గెలిచినందున రాజీనామా చేయమని అడగవచ్చని వ్యాఖ్యానించారు. తాను కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈటల రాజేందర్ పదవుల కోసం పెదవులు మూయడని వెల్లడించారు. హుజూరాబాద్ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటానని ప్రకటించారు.

మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం

తన మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోనని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మంత్రి పదవి కంటే తనకు ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. గొప్పగా ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు భావించట్లేదని వివరించారు. పోలీసులు, అధికారులు ఉన్నారని కబ్జా చేశానని అంటారా? అని ప్రశ్నించారు. అవి దేవాలయ భూములని కాగితాలు తీసుకురండని అన్నారు. కలెక్టర్ నివేదిక పచ్చి అబద్ధమని గొంతెత్తారు. తనలాంటి కొందరు నేతలు ఎందుకు దూరమయ్యామో సీఎం అంతరాత్మకు తెలుసని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

యానాంలో మల్లాడికి ఎదురుదెబ్బ.. యువ కెరటం విజయ బావుటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.