రెవెన్యూ శాఖలోని తహసీల్దారులు అందరూ... కొత్తగా ఓ సంఘంగా ఏర్పాటయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన తహసీల్దారులు విజయవాడలోని ఓ హోటల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి తమ గొంతు వినిపించాలనే ఉద్దేశ్యంతోనే.. తాము ఓ సంఘంగా ఏర్పాటు అయ్యామని వారు తెలిపారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌కు అనుబంధంగానే తాము పనిచేస్తామన్నారు. ఎన్నికల సమయంలో జరిపిన బదిలీలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదన్నారు. ఎన్నికల విధులు నిర్వహించిన తహసీల్దార్లుకు బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందులున్నాయని... వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటవుతుందని వెల్లడించారు.
ఇవీ చదవండి...'సహాయ ఆచార్యుల పరీక్షను రద్దు చేయాలి'