ETV Bharat / city

పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు - పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు

రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పరిశ్రమల శాఖకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ap government
ఏపీ ప్రభుత్వం
author img

By

Published : Nov 13, 2020, 4:58 PM IST

రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పరిశ్రమల సమగ్ర సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించే వేర్వేరు సర్వేల కోసం వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు పరిశ్రమల శాఖకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సహా సదుపాయల కల్పనా సహాయకుల సేవల్ని వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రోత్సాహక అధికారులుగా, జిల్లా పరిశ్రమల శాఖ ఏరియా అధికారులుగా పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం, రెవెన్యూ, ఉపాధి కల్పన తదితర అంశాలను మొబైల్ యాప్​లో నమోదు చేయాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పరిశ్రమల శాఖ ఆదేశాల జారీ చేసింది. దీంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాలపై అవగాహన కల్పించేలా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి..

సాయం కోరుతూ వచ్చాడు... సెల్​ఫోన్ ఎత్తుకెళ్లాడు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.