సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 150-200 మిలియన్ యూనిట్ల మధ్య విద్యుత్తు డిమాండ్ ఉంటుంది. డిస్కంలు రోజువారీ డిమాండ్ ఆధారంగా రేపటి విద్యుత్తు డిమాండ్‌ను నేడే అంచనా వేసి ఉత్పత్తి సంస్థలకు ప్రతిపాదన పంపుతాయి. ఆ మొత్తం ఉత్పత్తిని డిస్కంలు తీసుకోవాలి. ఒక వేళ తీసుకోకున్నా ప్రతిపాదిత యూనిట్లకయ్యే మొత్తం సొమ్మును ఉత్పత్తి సంస్థలకు చెల్లించాలి. వాడుకోకున్నా చెల్లించడం డిస్కంలకు భారంగా మారింది. అందుకే ఈసాఫ్ట్‌వేర్ రూపకల్పనకు యోచించింది. వాతావరణ పరిస్థితులు, గత రెండేళ్లలో అదే రోజు వినియోగం.. వంటివి క్రోడీకరించి సాఫ్ట్‌వేర్ డిమాండ్‌ను అంచనా వేస్తుంది. ఈ అంచనాలనే డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు ప్రతిపాదిస్తాయి. ఐఐటీ ముంబయి నిపుణుల సహకారంతో విద్యుత్తు శాఖ సిబ్బంది సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత