ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి కోసం ఈనాడు సంస్థ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2020 నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ కన్సల్టెన్సీ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. విదేశాల్లో ఉన్న అవకాశాలు, మంచి ర్యాంకు కలిగిన విశ్వవిద్యాలయాలు, ఉపకారవేతనాలు, చదువు పూర్తయ్యాక అందించే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివరాలను అందుబాటులో ఉంచాయి. ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్, కాంత్స్ సంస్థలు ఫెయిర్‌కు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమానికి పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి కోర్సులు, ఎక్కడ చేస్తే బాగుంటుందన్న అంశాలపై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
ఇదీ చదవండి: