ETV Bharat / city

ఆంగ్లమాధ్యమ బోధనకు కట్టుబడి ఉన్నాం: ఆదిమూలపు సురేశ్

author img

By

Published : Feb 12, 2020, 3:02 PM IST

ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు కట్టుబడి ఉన్నామని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉద్ఘాటించారు. అందరి ఆమోదం ఉందా అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారన్న మంత్రి... వారికి సమాధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు అంగీకారం తెలియచేస్తూ తీర్మానం చేశాయని వెల్లడించారు. తీర్మానాలను అన్ని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టామన్నారు.

education minister aadimulapu suresh talks about english mediam in government schools in state
ఆంగ్ల మాధ్యమం గురించి మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేశ్
మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు కట్టుబడి ఉన్నామని... దీనికి పేరెంట్స్ కమిటీలు అంగీకరించాయని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. 45 వేలకు పైగా పాఠశాలల నుంచి అంగీకార తీర్మానాలు వచ్చాయని వివరించారు. ఆంగ్లమాధ్యమం గురించి ప్రజలంతా సానుకూలంగానే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారని వివరించారు. తల్లిదండ్రుల కమిటీల తీర్మానాలను గ్రామసచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. కుప్పం మండలంలోని 140 పాఠశాలల్లో ఈ తీర్మానం చేశారని మంత్రి చెప్పారు.

పాఠ్యాంశాలను మారుస్తాం

ఆంగ్లమాధ్యమంలో బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపట్టామని మంత్రి సురేశ్‌ తెలిపారు. ఆంగ్లమాధ్యమ అమలు, అమ్మఒడికి ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారులను నియమించామన్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాలనూ మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ వేర్వేరుగా ఇస్తామని.. 'జగనన్న విద్యా కానుక' ద్వారా బ్యాగ్, యూనిఫాం, బూట్లు ఇస్తామని వెల్లడించారు. విద్యార్థికి ఇచ్చే ఒక్కో కిట్‌కు రూ.1,500 ఖర్చవుతుందని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి.. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలకు కేబినెట్ ఆమోదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.