స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. జిల్లాకు ఒకరు చొప్పున సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. మరో నలుగురిని రిజర్వ్‌లో ఉంచింది. వీరితో పాటు మరో 15మంది ఉన్నతాధికారులను ఎక్స్పెండేచర్ పరిశీలకులగా నియమించింది. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను ఎన్నికల కమిషనర్‌కు అందించనున్నారు. బాధ్యతలు చేపట్టిన వారితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతలు, విధులు, కార్యాచరణపై ఎన్నికల పరిశీలకులకు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు.
జిల్లా | ఎన్నికల పరిశీలకులు |
శ్రీకాకుళం | ఎం.రామారావు |
విజయనగరం | పి.ఎం.శోభ |
విశాఖ | ప్రవీణ్‌కుమార్ |
తూర్పు గోదావరి | పి.ఉషాకుమారి |
పశ్చిమగోదావరి | హిమాన్షు శుక్లా |
కృష్ణా | ఎం.పద్మ |
గుంటూరు | కాంతిలాల్ దండే |
ప్రకాశం | కె.శారదాదేవి |
నెల్లూరు | బి.రామారావు |
చిత్తూరు | టి.బాబూరావునాయుడు |
కడప | పి.రంజిత్‌బాషా |
అనంతపురం | కె.హర్షవర్ధన్ |
కర్నూలు | కె.ఆర్.బి.హెచ్.ఎన్. |
రిజర్వ్‌లో ఉన్నవారు
సీహెచ్ శ్రీధర్, జి.రేఖారాణి, టి.కె.రమామణి, ప్రభాకర్‌రెడ్డి