Bahubali Thali: ఇదిగో.. ఈ కంచం ఖాళీ చేస్తే లక్ష రూపాయలు సొంతం. రుచికి తోడు బహుమానం ఇస్తామంటోంది.. విజయవాడలోని నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్. ఈ ఆఫర్‌లో భాగంగా.. బాహుబలి థాళి పేరుతో కంచంలో బిర్యానీ సహా 30 ఇతర వంటకాలు వడ్డిస్తారు. వాటన్నింటినీ.. 30 నిమిషాల్లో శుభ్రంగా తినేస్తే.. అక్షరాల లక్ష రూపాయలు సొంతం చేసుకోవచ్చు.
పోటీల్లో రోజుకు 40మందికి పైగా..
విజయవాడలో ఆహార ప్రియులను ఆకర్షించేలా.. ఇతర ప్రాంతాల్లో బాగా ప్రచారంలో ఉన్న ట్రెండ్‌ను అనుసరిస్తోందీ రెస్టారెంట్. ఈ విషయాన్ని ఆన్‌లైన్ చూసిన జనం.. క్యూ కట్టేస్తున్నారు. పోటీల్లో రోజుకు 40 మందికిపైగానే పాల్గొంటున్నారని.. రెస్టారెంట్ యజమాని వరనాయుడు తెలిపారు. కొన్నిరోజుల కిందట.. ఓ విజయవాడ యువకుడు బాహుబలి థాళి బిర్యానీని 30 నిమిషాల్లో ఆరగించి.. లక్ష రూపాయలు గెలుచుకున్నాడని.. వెల్లడించారు.
ఇదీ చదవండి:
Jail theme restaurant: అదిరే ఫుడ్ కావాలంటే.. ఆ 'జైలు'కు వెళ్లాల్సిందే