తిరుపతి రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు సందర్భంగా పలు రైళ్లను రద్దు లేదా పాక్షికంగా రద్దు చేసినట్టు తూర్పుకోస్తారైల్వే వెల్లడించింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నట్లు వివరించింది.
రద్దయిన రైళ్లు
- విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్ రైలు... 5, 7, 10, 12 తేదీల్లో రద్దు కాగా... తిరుపతి- విశాఖ రైలు.. 6, 8,11,13తేదీలలో రద్దయింది.
- తిరుపతి- పూరి రైలు 5, 6,8,10,12తేదీలలో రద్దు కాగా.. పూరి- తిరుపతి రైలు 7,8,10,11,12,14 తేదీల్లో రద్దు.
- తిరుపతి -బిలాస్పూర్ రైలు.. 7,11 తేదీల్లో... బిలాస్ పూర్- తిరుపతి రైలు.. 9, 13 తేదీల్లో రద్దు చేశారు.
- ఈనెల 7వ భువనేశ్వర్ -తిరుపతి, 8న తిరుపతి-భువనేశ్వర్ రైళ్లు రద్దయ్యాయి.
పాక్షికంగా రద్దుచేసిన రైళ్లు
- డబుల్ డెక్కర్.. తిరుపతి-విశాఖ, రేణిగుంట-తిరుపతిల మధ్య నడవదు.
- విశాఖ-కడప రైలు.. 10, 11 తేదీల్లో, కడప- విశాఖ రైలు 11,12 తేదీల్లో తిరుపతి స్టేషన్కు రాదు
- మరో మూడు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: జిల్లాల్లో జోరుగా తెదేపా నేతల ప్రచారం