ETV Bharat / city

కొవిడ్ బాధితులకు.. రూ.కోటి 56లక్షల విలువైన మందుల పంపిణీ

author img

By

Published : May 25, 2021, 3:16 PM IST

కొవిడ్ బాధితులకు సాయం అందించేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి. మందులు, హెల్త్ కిట్స్, ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు పంపిణీ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరింత మంది రావాలని స్టేట్ కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

Donations to Covid Victims
కొవిడ్ బాధితులకు విరాళాలు

కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వైరస్ బాధితులకు సాయం అందించేందుకు వివిధ సంస్థల నుంచి సానుకూల స్పందన వస్తోందని స్టేట్ కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో బయోఫోర్, ఇండియాబుల్స్, మన తెలుగు అసోసియేషన్, డీకన్సెస్ గేట్​వే హాస్పిటల్స్ సుమారు రూ.కోటి 56లక్షల విలువైన మందులు, హెల్త్ కిట్స్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారని తెలిపారు.

మందులు, ఇతర వస్తువులన్నీ ఆయా జిల్లాల్లో విరాళాలు ఇచ్చిన వారు సూచించిన ప్రదేశాలకు పంపడం జరిగింది. అక్కడ సంబంధిత అధికారులు వాటిని అందుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది సహాయం చేసేందుకు ముందుకు రావాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

ఇదీ చదవండి:

'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.