కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు రైతులు, వర్తక సంఘాలు, విద్యాసంస్థల తరపున రూ.2 కోట్ల విరాళం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తరపున రూ.కోటి, గుంటూరు డీసీసీబీ మరో కోటి డీసీఎంఎస్ తరపున రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రజలు, సంస్థలు రూ.36లక్షలు సీఎం సహాయనిధికి అందించారు. లోటస్ ట్రేడింగ్ కంపెనీ,డాల్ఫిన్ పాలిమర్స్ 25 లక్షలు, బండి సాహితీ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ రూ.25 లక్షలుగా విరళాలు ప్రకటించారు. ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి చెక్కులను అందిచారు.
ఇదీచదవండి